*బాన్సువాడ * నియోజకవర్గానికి ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేసినటువంటి *రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు

రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు తెలిపారు.

ఈరోజు బాన్సువాడ లోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…

బాన్సువాడ లోని SRNK డిగ్రీ కాలేజీ కి అనుబంధంగా నూతనంగా ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజీ ను మంజూరు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం GO NO. 26ను జారీ చేసింది.

ఈ అకాడమిక్ సంవత్సరం (2022-23) నుండే అడ్మిషన్లు ప్రారంభిస్తారు.

నాలుగు కోర్సులు BA, BSC (MPC/BZC), Bcom లతో ప్రారంభం.

కాలేజీలో మౌళిక వసతులు, అదనపు తరగతి గదుల కోసం రూ.3.19 కోట్ల నిధులను మంజూరు చేసింది.

15 టీచింగ్ పోస్టులు మంజూరు.

దోస్త్ ఆన్లైన్ ద్వారా విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు.

బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఈ ప్రాంత విద్యార్థుల కల

బాన్సువాడ, కోటగిరి లలో ఇప్పటికే ఉర్దూ మీడియం ఇంటర్ కాలేజీలు ఉన్నాయి.

బాన్సువాడ, కోటగిరి లలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి ఇంటర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ అయినాయి.

ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్ళలేక చదువు ఆపివేస్తున్నారు.

నూతన ఉర్దూ డిగ్రీ కాలేజీ రావడంతో ఇక విద్యార్థులు డిగ్రీ చదువుకోవచ్చు.

బాన్సువాడ తో పాటుగా జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల లోని విద్యార్థులకు కూడా ఈ కాలేజీ ఉపయోగపడుతుంది.

ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

ఇచ్చిన హామీ నెరవేర్చాను. నాకు చాలా ఆనందం కలుగుతుంది.

ఉర్దూ డిగ్రీ కాలేజీ మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.

సహకరించిన అధికారులు, ఇతర యంత్రాంగానికి ధన్యవాదాలు.

 

●●అదేవిధంగా మైనారిటీ శాఖ ద్వారా వివిధ పనుల కోసం కామారెడ్డి జిల్లాకు రూ. 5.28 కోట్ల నిధులు మంజూరు అయినాయి.

నిధులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేసుకోవచ్చు.
*రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు