బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నాయకుడు కాదు.

దేశ నాయకుడు…
అంబేద్కర్ అందించిన స్వేచ్ఛ వల్లే సమాజం ముందంజలో ఉంది
ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ఆనంద్, టి  ఆనంద్
వికారాబాద్ జిల్లా బ్యూరోజనం సాక్షి  డిసెంబర్ 6
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నాయకుడు కాదని, ఆయన దేశ నాయకుడని ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ఆనంద్, టి ఆనంద్ లు అన్నారు. మంగళవారం వికారాబాద్ మునిసిపాలిటీలోని రెండవ వార్డు ధన్నారం ఫ్రెండ్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66 వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ యువజన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆనందులు మాట్లాడుతూ అంబేద్కర్  రాజ్యాంగం రాయడం వలన నేడు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని అంబేద్కర్ కొందరివాడు కాదని అందరివాడని తెలిపారు. అందరు అయన అడుగు జాడల్లో నడవాలని వారు పిలుపునిచ్చారు. అంబేద్కర్ చరిత్ర తెలవని కొందరు మూర్ఖులు ఆయనను ఇప్పటికీ కుల నాయకునిగా చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అందించిన స్వేచ్ఛ వల్లే మన సమాజం ప్రగతి పథంలో ముందుకు సాగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంబేద్కర్ అడుగు జాడల్లోనే దళిత గిరిజన బహుజనులకు న్యాయం చేసే విదంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో దన్నారం పాఠశాల విద్యార్థులు, ఉపాద్యాయులు, ఫ్రెండ్స్ యువజన సంఘం సెక్రటరీ అమర్, నాయకులు రాకేష్, జంగయ్య, శ్రీకాంత్, శ్రీనివాస్, గోపాల్, శివ కృష్ణ, ప్రమోద్, ప్రశాంత్, గ్రామ పెద్దలు  భీమ్ రావు, రాంచెంద్రయ్య, మాజీ సైనికులు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.