బాబు మళ్లీ మాట మార్చొద్దు : తెలంగాణ విద్యార్థులు
ఆదిలాబాద్: తెలంగాణకు వ్యతిరేకం కాదంటు ‘మీ కోసం వస్తున్న ‘ పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తెలంగాణ సెగ వెంటాడుతూనే ఉంది. తెలంగాణ పై అఖిల పక్షం కోరిన బాబును గతంలోల మళ్లీ మాట మర్చోద్దని విద్యార్థులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై బాబును తెలంగాణ విద్యార్థులు నిలదీశారు. విద్యార్థుల ప్రశ్నలను బాబు దాట వేశారు. ఈ నెల 28న కేంద్రం తెలంగాణపై అఖిలపక్షం మూహుర్తం నిర్ణయించిన విశయం తెలిసిందే.