బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని తెదేపా ధర్నా
నెల్లికుదురు: మహరాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన బాబ్లీ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం మండల పార్టీ నాయకులు ధర్నా చేశారు. దీంతో కొద్దిసేపు రాకపోకలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిక శంకర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు బి.యాదగిరి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎన్ తిరుమల్, ఇతర నాయకులు పాల్గొన్నారు.