బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి,

మేడ్చల్ (జనంసాక్షి): చిన్న పిల్లలతో వెట్టిచాకిరీ, పనులు చేయిస్తే కేసులు నమోదు చేయాలి,
ఆపరేషన్ ముస్కాన్ నిర్వహణ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి,
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. ,
మంగళవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆపరేషన్ ముస్కాన్ –8 నిర్వహణ సమీక్ష సమావేశాన్ని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ A. M. రాజిరెడ్డి, రాచకొండ షీ టీమ్ డీసీపీ సలీమా, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్తో కలిసి నిర్వహించారు.  ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ 18 సంవత్సరాలలోపు పిల్లలు ఎవరైనా ప్రమాదకర ప్రదేశాలలో పనిచేస్తున్నట్లైతే వారిని గుర్తించి  రక్షించాలని, పనిచేయిస్తున్న యజమానుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.. చిన్న పిల్లల్ని ఎవరైనా వెట్టిచాకిరి గురి చేస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  ఈనెల 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్లో ఆపరేషన్ ముస్కాన్లో పోలీసుల బృందం,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,  లేబర్ డిపార్ట్మెంట్, సఖి సెంటర్, విద్యాశాఖ,  జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్టుమెంట్ అధికారులు,  సిబ్బందితో పాటు ప్రజలు సహకరించాలని అన్నారు.  అలాగే 18 సంవత్సరాల లోపు, వివిధ రకాల బాల కార్మికులు వారు, కిరాణం షాప్లలో, మెకానిక్ షాపులలో,  హోటళ్లలో పనిచేస్తూ , వదిలివేయబడిన పిల్లలు రోడ్డుపై  భిక్షాటన చేస్తున్న పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు ఉన్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం, లేదా స్టేట్ హోమ్ కు పంపించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి వివరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ తో పాటు ఆయా శాఖల వారు పరిశ్రమలు, దుకాణాలు సందర్శించాలని చిన్న పిల్లలతో ఎవరైనా వెట్టిచాకిరీ చేయించినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు నమోదు చేయాలని తెలిపారు. బాలకార్మికులుగా పట్టుకున్న పిల్లలను స్టేట్ హోమ్ కు పంపించే ముందు జిల్లా మెడికల్ అధికారులతో కరోనా టెస్ట్ నిర్వహించాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్  అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహించాలని అన్నారు. అధికారులు వారం రోజుకొకసారి తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.  ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఎన్ని కేసులు వచ్చాయి, ఎన్ని గుర్తించారు, ఎంత మందిని వసతి గృహాలలో పంపించారు మొత్తం రిపోర్టును తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు ఈ సమావేశంలో బాలల సంరక్షణ అధికారి ఎండి ఇంతియాజ్ రహీం, బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ బి నాగమణి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి సుమన్, సి డి పి వో లు ఉదయశ్రీ, ఎఫ్ సి బా, ప్రియాంక, పావనితదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు