బాలబాలికలకు అవగాహన చాలా అవసరం…

– మండల వైద్య అధికారిని స్రవంతి….
 గద్వాల రూరల్ జూలై 30 (జనంసాక్షి):-జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని ఇర్కిచేడు గ్రామంలోని‌ పంచాయతి కార్యాలయంలో మరియు ప్రాథమిక పాఠశాల నందు జిల్లా సంక్షేమ అధికారి  అదేశం మేరకు గ్రామ స్థాయి సమావేశం,బడి బయట పిల్లలను బడిలో చేర్పించాలని,సమావేశం జరిగింది..డాక్టర్ స్రవంతి మాట్లాడుతూ కిషోర బాలికలు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, పౌష్టికాహార లోపం లేకుండా బాల బాలికలు తీసుకోవాలని,బాలబాలికలకు అవగాహన చాలా అవసరమని సూచించారు… పాఠశాల, గ్రామపంచాయతి నందు కిషోర బాలికల, బాలల హక్కులు, చట్టాల పై అవగాహన సదస్సు ను మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల పరిరక్షణ  అవుట్ రిచ్ వర్కర్ లక్ష్మీ దేవి అధ్వర్యంలో నిర్వహించారు..లక్ష్మీ దేవి విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ 06 నుంచి 14  సంవత్సరాల లోపు పిల్లలందరు ఉచిత నిర్బంధ విద్యను పొందాలన్నారు…బాల్య వివాహాల నిషేధ చట్టం,బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం ,ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం,బాల‌ కార్మిక మరియు నియంత్రణ సవరణ చట్టాలపై గ్రామస్థులకు,విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది….డాక్టర్ స్రవంతి,,పంచాయతి సెక్రటరీ రాజశేఖర్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు