బాలల సమస్యల కోసం బాలల పరిరక్షణ కమిటీ పని చేయాలి: సర్పంచ్ మల్లీశ్వరి వెంకన్న
గరిడేపల్లి, అక్టోబర్ 21 (జనం సాక్షి): గరిడేపల్లి మండలంలోని మంగపురం గ్రామంలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈ యొక్క కార్యక్రమంలో పిల్లల సంరక్షణ గ్రామాలలో ఏ విధంగా చేపట్టాలి పలు అంశాలపై పరిరక్షణ అధికారి సాయి త్రిలోక్ వివరించడం జరిగిందన్నారు. బాలల పరిరక్షణ గ్రామంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రతి ఒక్కరూ బాలల పరిరక్షణ కొరకు కృషి చేస్తూ వాళ్లకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి బాలలకు భరోసా ఉంటూ వాళ్ల సంరక్షణ కొరకు కృషి చేయాలని కమిటీ సభ్యులకు వివరించి పిల్లల బాధ్యత గ్రామ స్థాయి బాలల పరిరక్షణ కమిటీ చూసుకోవాలని బాలలకు ఎటువంటి సమస్య వచ్చినా 1098 చైల్డ్ హెల్ప్ లైన్ సంప్రదించాలని తెలియజేశారు. బాల్య వివాహాలు 18 సంవత్సరాల లోపు అమ్మాయికి 21 సంవత్సరాల లోపు అబ్బాయికి పెళ్లి చేయడం చట్టరీత్యా నేరం అని పిల్లలకు చిన్న వయసులో పెళ్లి చేయడం వలన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుందని పిల్లలు మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలియజేశారు. గ్రామంలో బాలల సమస్యల పరిరక్షణ కొరకు కమిటీ ఏర్పాటు చేయడం బాలల అభివృద్ధికి దోహదపడుతుందని
పెరబోయిన మల్లీశ్వరి వెంకన్న మాట్లాడుతూ బాలల గ్రామంలో బాల్యవివాహాలు బాల కార్మికులు అనాధ బాలలు తదితర సమస్యలపై నిరంతరం దృష్టి పెడతామని తెలియజేశారు.
బాలల సంక్షేమ కమిటీ బాల కార్మికులు అనాధ బాలలు రక్షణ సంరక్షణ అవసరమైన బాలలు మొదలైనవి చర్చించినారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ పెరబోయిన మల్లీశ్వరి వెంకన్న, బాలల పరిరక్షణ అధికారి సాయిత్రిలోక్ , పాఠశాల, ఉపాధ్యాయులు, కార్యదర్శి సాయి బాబా , చైల్డ్ లైన్ సిబంది సఫీయా, అంగన్వాడి వర్కర్స్ విజయ , పద్మ , కనకమ్మ , నాయనమ్మ , గ్రామ ప్రజలు సరస్వతి , గోవిందమ్మ ,కావేరి , ఆశా వర్కర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
Attachments area