బాలల హక్కులు మరియు సమస్యలపై అవగాహన సదస్సు

అయిజ,ఆగస్టు 03(జనం సాక్షి):
జోగులమ్మ గద్వాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో  చైర్మన్ చిన్న దేవన్న అధ్యక్షతనలో ఐజ పట్టణంలో ఎంపీడీవో కార్యాలయంలో బాల కార్మికుల నిర్మూలన పై అవగాహన సదస్సు,
మున్సిపాలిటీ  చైర్మన్ మాట్లాడుతూ బాల కార్మికుల పుట్టినప్పుడు నుండి సంవత్సరాలు 18 సంవత్సరాలు
నిండింతవరకు ఎలాంటి పనులు చేపించకూడదని ఆయన అన్నారు అదేవిధంగా పుట్టినప్పటి నుండి ఆరు సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు వివిధ కర్మ గారాలలో బాల బాలికలను పనిచేయించకూడదని ఇలా ఎవరైనా గాని బాల బాలికాలను పనిచేయుచున్న యెడల
వాళ్లపై కఠిన చర్యలు తప్పవని ఆయన అన్నారు మరియు పుట్టినప్పటినుంచి ఆరు సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు నిండింతవరకు పిల్లలను పాఠశాలలో విడిచాలని పిల్లల యొక్క తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు
పిల్లలు చదువుకునే వయసులో పనులు చేయించడం చట్టరిత నేరమని ఆయన అన్నారు కనుక ఇప్పటికైనా
పిల్లలకు తల్లిదండ్రులు బాలబాలికలను చదివించే విధంగా చూడాలని పిల్లలు చదివించడానికి ప్రభుత్వము ముందుగా ఉందని ఆయన చెప్పారు
అదేవిధంగా ఎక్కడైతే చిన్న వయసులోనే బాలబాలికలకు బాలవివాహాలు జరిగితే వెంటనే 1098 కి ఫోన్ చేయాలని ఆయన అన్నారు అదేవిధంగా బాలబాలికలు హోటల్స్ కానీ ప్రైవేటు పాఠశాలలో గాని ఇండ్లలో గాని పనిచేస్తుంటే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఫోన్ చేసిన వెంటనే తగిన అధికారులు వచ్చి పనుల్లో పెట్టుకున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆ యొక్క బాల బాలికలను చదువుకునేందుకు పాఠశాలలో విడవడం జరుగుతుంది,
ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న
ఐజ మండల ఎస్సై నరేష్ కుమార్
ఐజ మున్సిపాలిటీ కమిషనర్ నల్గొండ నరసయ్య,
డిడబ్ల్యుఓ సూపర్వైజర్ కమలాదేవి
డిఆర్బి నిర్మల దేవి
ప్రభుత్వ డాక్టర్ ఓబులేష్
చైల్డ్ మ్యారేజ్ ఆఫీసర్ నరసింహ
ఐజ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అంగన్వాడి టీచర్లు ,
 పొదుపు సంఘాలమహిళలు, ప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు మాల వీరేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు