*బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి .
*బాలల పరిరక్షణ అధికారి
రాజ కొమురయ్య.
చిట్యాల 12(జనం సాక్షి )బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బాలల పరిరక్షణ అధికారి కొమురయ్య అన్నారు. బుధవారం మండలంలోని వెంచరామి గ్రామపంచాయతీ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారానికి జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ,వివిధ విభాగాలకు చెందిన 16 మంది సభ్యులతో గ్రామస్థాయి బాలల పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు.బాలల సంరక్షణ ధ్యేయంగా ఈ కమిటీలు పనిచేస్తాయని, ఈ కమిటీ చైర్మన్లుగా స్థానిక సర్పంచ్ కచ్ఛు మల్లేశం, కార్య దర్శిగా పంచాయతీ కార్య దర్శి ఇలియాస్ కన్వీనర్ గా స్థానిక అంగన్వాడీ టీచర్ కె స్వప్న వ్యవహరించనున్నట్లు ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ జయప్రద,రాజ కొమురయ్య తెలిపారు. ఎవరైనా బాలల హక్కులకు భంగం కలిగించినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, పిల్లలకు ఏమైనా సమస్యలు ఎదురైతే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కె. శ్రీకాంత్, డిసిపియు సోషల్ వర్కర్ ఎం. శైలజ, అవుట్ రీచ్ వర్కర్ పి సోషల్ కుమార్, ఆశ వర్కర్ తదితరులు పాల్గొన్నారు.