బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
సిడిపిఓ కమలాదేవి
మల్దకల్ సెప్టెంబర్ 28 (జనంసాక్షి) గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందించాలని సిడిపిఓ కమలాదేవి అన్నారు. బుధవారం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో అంగన్వాడి 2 కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమానికి సిడిపిఓ కమలాదేవి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు సరియైన పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వ నిర్వహించే పోషక మాంసంలో, గ్రామంలోని పోషక అభియాన్ గర్భిణీలకు బాలింతలకు చిరుధాన్యాలు, ఆకుకూరలు,పౌసికాహారం అందేలా చూడాలని అన్నారు.తీవ్ర లోపం అతి తీవ్ర లోపం కింద గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా బాలమృతం ఉదయం సాయంత్రం అందించాలని గర్భిణీలకు పాలు,గుడ్లు,ఆకుకూరలు, ఐరన్ అందించాలని ఆమె అన్నారు.గ్రామాలలో గర్భిణీలను మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో కాన్పులు జరగాలనిఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచు సువార్తమ్మ,ఎంపిటిసి సరోజమ్మ, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్ వనజాక్షి, తదితరులు పాల్గొన్నారు.
Attachments area