బాలికలకు ఆడపిల్ల చదువుపై అవగాహన కార్యక్రమం
జిల్లా బాలల పరిరక్షణ విభాగ ప్రొటెక్షన్ అధికారి ఎస్.కె మీరా
హుజూర్ నగర్ అక్టోబర్ 13 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలికలకు ఆడపిల్ల చదువుపై జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి ప్రొటెక్షన్ అధికారి ఎస్కే మీరా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గురువారం హుజూర్ నగర్ పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నందు జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలికలకు ఆడపిల్ల చదువుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా మీరా మాట్లాడుతూ ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ అందరూ కూడా గ్రామస్థాయి నుండి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారని, నేటి సమాజంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలు, బాల్య వివాహం వల్ల జరిగే అనర్ధాలు వాటి వల్ల నష్టాల గురించి బాలికలకు వివరించడం జరిగిందన్నారు. పిల్లలకు అన్ని విధాల ఆదుకోవటానికి పిల్లల చట్టాలు బలంగా ఉన్నాయని , ఆడపిల్లల సంరక్షణ, చదువు ప్రాముఖ్యత పెరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బాలరక్ష భవన్ చైల్డ్ లైన్ అధికారి సఫియా, బాలికల పాఠశాల అధ్యాపక బృందం, పిల్లలు పాల్గొన్నారు.
Attachments area