బాలికల అభివృద్ధియే సమాజాభివృద్ధిగా ప్రతి ఒక్కరూ బాలికల విద్య, అభివృద్ధికి కృషి.

వనపర్తి టౌన్ : అక్టోబర్ 11 (జనం సాక్షి)
   బాలికల అభివృద్ధియే సమాజాభివృద్ధిగా ప్రతి ఒక్కరూ బాలికల విద్య, అభివృద్ధికి కృషి…… చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్వాన్ అధికారులకు ఆదేశించారు.
      మంగళవారం ఐ.డి. ఓ.సి. సమావేశ మందిరంలో “అంతర్జాతీయ బాలిక దినోత్సవం” సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని, నేటి సమాజంలో బాలికలు లింగ అసమానతలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. విద్య, పోషణ, బాల్యవివాహాలు, లైంగిక, శరీరకంగా వేధింపులకు గురవుతున్నారని, లింగ అసమానతలపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. బాలికల సంరక్షణపై ప్రజలు చైతన్యం కావాలని, బాల్యవివాహాలు విడనాడాలని, ఎక్కడైనా బాల్యవివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులని, బాలికల విద్యను ప్రోత్సహించాలని,  గ్రామాలలో తల్లిదండ్రులకు సర్పంచులు, ,గ్రామ పెద్దలు, పంచాయతీ కార్యదర్శులు అవగాహన కల్పించి వారిని పాఠశాలలకు వెళ్లేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
      డి డబ్ల్యూ ఓ మాట్లాడుతూ బాల్యవివాహాలను అరికట్టేందుకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సుకన్యా యోజన, బేటి పడావో బేటీ బచావో వంటి కార్యక్రమాలను పని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించి, వారి సంరక్షణ బాధ్యతలను చేపడుతున్నట్లు ఆమె సూచించారు. బాలికలు అన్ని రంగాలలో రాణించాలని, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని, గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె తెలిపారు.
     అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.
      ఈ కార్యక్రమంలో డి.డబ్ల్యూ. ఓ. పుష్పలత, సిడబ్ల్యుసి చైర్ పర్సన్ అలివేలమ్మ, జి.సి.డి. ఓ. సుబ్బలక్ష్మి, డి.సి.పి. ఓ. రాంబాబు, సి.డబ్ల్యు.సి. సభ్యులు, సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
……..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.