బాలికల గురుకుల కళాశాల వంట గదిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ.

 నిర్మల్ బ్యూరో, జులై19,జనంసాక్షి,,  జిల్లా కేంద్రంలో ని    సోఫినగర్ బాలికల గురుకుల  జూనియర్ కళాశాల
వంట గదిని జిల్లా పాలనాధికారి  ముషారఫ్ ఫారుకి మంగళవారం  ఆకస్మికంగా  తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా  వంట గది పరిసరాలను పరిశీలించి,  నాణ్యత ప్రమాణాలు  పాటిస్తూ శుభ్రమైన  ఆహారాన్ని  విద్యార్థులకు అందించాలని అన్నారు.
అనంతరం   కోడి గ్రుడ్లను పరిశీలించి  వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
వంట గది లో ఉన్న ప్రతిదీ పరిశీలించి  వంట గది ఎప్పటికప్పుడు శుభ్రంగా  ఉంచాలని,  కళాశాల ఆవరణలో  పిచ్చి మొక్కలు తొలగించి,  పరిశుభ్రత  పాటించాలని,  కూరగాయలు ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలని,  కుళ్ళిన,  పాడయిపోయిన  కూరగాయలు వాడకుండా,  మంచి  ఆహారాన్ని  అందించాలని  తెలిపారు. అనంతరం లెఫ్ట్ పోచంపాడ్ సాంఘీక సంక్షేమ కళాశాల ను సందర్శించి విద్యార్థుల బాగోగులు ఆడిగితెలుసుకున్నారు. విద్యార్థుల కు నాణ్యమైన విద్య తోపాటు మంచి ఆహారం అందించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు, ప్రతి రోజు వంటగది పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు
కలెక్టర్ వెంట తహసీల్దార్ శుభాష్,  తదితరులు ఉన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది
.