బాలుర వసతిగృహలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణి
లింగంపేట్ 26 జూలై జనంసాక్షి)
లింగంపేట్ మండలంలోని ఎసాస్సి బాలుర వసతి గృహంలో మంగళవారం గ్రామసర్పంచ్ బొల్లు లావణ్య ఎంపీపీ గరీబున్నీస బేగంవిద్యార్థులకు పాఠ్య పుస్తాకాలు పంపించేశారు.తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు పంపించేయడం సంతోషకరమైన విషయమని సర్పంచ్ లావణ్య పేర్కొన్నారు.విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించి స్థిరపడాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో వాచ్మెన్ సమద్ స్థానికనాయకులు తదితరులు ఉన్నారు.