బాల్కొండ మండలం లో వ్యవసాయ పంటలను పరిశీలించి తగు సూచనలు
బాల్కొండ జూలై 16(జనం సాక్షి)నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్.బి, జలాల్పుర్ గ్రామ లలో వ్యవసాయ అధికారి పంటలను పరిశీలించి పలు సూచనలు తెలిపారు రైతులకు మొక్కజొన్న పంటలో సంరక్షణ చర్యలు చేపట్టండి
గత కొన్ని రోజులుగా పడిన వర్షాలకి మొక్కజొన్న పంట పైన చూపించిన విధంగా అయింది కావున రైతులందరూ
1. మొక్కజొన్న నీటి నిల్వను తట్టుకోదు గనుక కాలువలు/పాయలు ఏర్పాటు చేసి నిల్వ నీటిని తొందరగా బయటకు పంపండి
2. నీరసంగా ఉండి వేరు ద్వారా పోషకాలు తీసుకోలేని స్థితిలో ఉన్న మొక్కజొన్న కు N:P:k 19:19:19 పౌడర్ లేదా 13.0.45 ఒక కేజీ ఎకరానికి స్ప్రే చేసుకోండి. లేదా
నానో యూరియా 300 ml లేదా DAP 20 గ్రాములు లీటర్ నీటికి
ఏదైనా ఒక దాన్ని పిచికారి చేసుకోండి.
2. ఎదుగుదల లోపించిన దానికి 20 కిలోల యూరియా 15 కిలోల పొటాష్ తో కలిపి పంటకు అందించాలి
3. అంతర కృషి ( కురిపే లేదా కొంకేతో ) చేయడం వలన మొక్క వేర్లకు గాలి అందుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమం లో
రైతు బంధు మండల కో ఆర్డనేటర్ నాగులపల్లీ రజేశ్వేర్, వన్నెల్. బి ఉపసర్పంచ్ నాగులపల్లీ కిషన్,MPTC బోజెందేర్, పన్నాల గంగారెడ్డి, జలాల్పుర్ సర్పంచ్ అనిల్,ఉపసర్పంచ్ లింబరెడ్డి,MPTC గంగారాం, మోహన్ రెడ్డి,AEO లు కృష్ణవేణి,నీహారిక,రైతులు పాల్గొన్నారు
Attachments area