*బాల్కొండ లో తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం*

బాల్కొండ జూలై 30 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల ఉమ్మడి  మండలంలోని  ఉపాధ్యాయులు బాల్కొండ మండల  కేంద్రంలోని రైతు వేదిక లో నిర్వహిస్తున్న తొలిమెట్టు బాల్కొండ, మెండోరా మరియు ముప్కాల్ మండలాలకు చెందిన ఉపాధ్యాయులు   శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్  అన్నారు జిల్లా  రిసోర్స్‌పర్సన్సు గా నర్సారెఢ్ఢి, రవి కుమార్, బోయడ నర్సయ్య, నటరాజ్ లు మొదటి విడతలో  తొలిమెట్టుపై నిర్వహి స్తున్న శిక్షణను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి రాజేశ్వర్ మాట్లాడుతూ జాతీయ సాధన సర్వే 2021లో విద్యార్థులు  జిల్లాసంతృప్తికర ఫలి తాలు సాధించలేదన్నారు. దీంతో ప్రభుత్వం ప్రతిష్ఠా త్మకంగా తొలిమెట్టు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తోంద న్నారు. దీంతో ప్రాథమికపాఠశాలలో అయిదో తరగతి పూర్తయ్యే సరికి ప్రతివిద్యార్థి ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించేలా ప్రణాళికలను రూపొందించు కోవాలన్నారు. అందుకు అనుగుణంగా బోధన చేపట్టేలా ఉపాధ్యాయులను చైతన్యవం తులు చేసేలా శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో నోడల్ అధికారి సుదర్శన్ చారి, CRPs, ప్రభాకర్, సతీష్, రజనీ  ,సుమలత, తధితరులు పాల్గొన్నారు.