బాల్యం బుగ్గి
మంచిర్యాల (జనంసాక్షి): బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అనేక పథకాలు రూపోందించినా ఫలితం లతేదు. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలక్ష్యంతో నిధులు వృథా అవుతున్నాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్ డివిజన్ కేంద్రాలలో బాల కార్మికుల రైల్వే, బస్‌స్టేషన్‌లు. మార్కేట్‌లు, హెటళ్లు, రెస్టారెంట్లు, కార్ఖానాలు, గోదాముల్లో దర్శనమిస్తున్నారు, పశువుల కాపరులు, ఇటుల మట్టీలు. మెకానిక్ షాపులలో కనిపిస్తున్నారు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులో కుటుంబ భారాన్ని మూస్తున్నారు. పాఠశాలకు వెళ్లాల్సిన చిన్నారులు పనిబాట పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు వేలకు పైగా బాల కార్మికులు ఉన్నారు. ఇందులో ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు కార్మిక శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 106 మ్దంఇ బాలకార్మికులకు విముక్తి కల్పించారు.
వెట్టిచాకిరీ:-
కొందరు బడానాయకులు, ధనవంతులు తమ ఇళ్లలో చిన్నారులను పనిలో పెట్టుకున్నారు. జిల్లాలో గిరిజన ప్రాంతాలైన ఉట్నూరు, ఆసిఫాబాద్ డిదిజన్ల పరిధిలోని మంబలాల గిరిజనుల ఆర్థిక స్థోమత లేక, పోషణ భారమై తమ పిల్లలను ఇళ్లలో పనికి పంపుతున్నారు. ఆయా యజమానులు చిన్నారులఅకు తిండిపెట్టి ఏడాదికి రూ.12 వేలనుంచి రూ.15 జీతం రూపంలో చెల్లిస్తున్నారు. పద్నాగేళ్లలోపు చిన్నారులను పనిలో పెట్లుకుంగే నేరం. అందుకు మూడు నెలల నుంచి ఆరు నెలల జైలు శిక్ష రూ. 40 వేల జరిమానా. అయినా చాన్నారులను పనిలో పెట్టుకుంటున్నారు.
అమలుకు ఆమడదూరంలో చట్టాలు:-
బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం అనేక చట్టాలు అమలులోకి వచ్చాయి. ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆయినా జిల్లాలో అమలుకు ఆమడదూరంలో ఉన్నాయి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జజిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది. కమిటీ ఛైర్మన్ కు ప్రభుత్వం ప్రత్యేకంగా మెజిస్ట్రేట్ అధికారి ఉన్నారు. బాల కార్మికులకు గుర్దించిన కార్మిక శాఖ కేవలం ఆ యజామానిని హెచ్చరించి కేసు నమెదు యచేసి జరిమానా విధిప్తోంది. ఆ శాఖాధథికిరులు బాలకార్మికుల తల్లిదండ్రులతో మాట్లాడి పనికి పంపొద్దని సూచించా వదిలేస్లున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత కారణంగా బిడ్డ చదువును మబాన్పించేసి, పనికి పంపుతోన్న తల్లిదండ్రుల్లో మాత్రం మార్పు రావాడం లేదు. దీంతో చిన్నారులు మళ్లీ పని బాట పడుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
శాఖల మద్య సమన్వయలోపం:-
వ్యవస్థను నిర్మూలించాల్సిన బాద్యత కార్మిక, ఆర్వీఎం శాఖాధికారులదే. కానీ ఈ రెండు శాఖల మధ్య సమన్వయంతో లక్ష్యం నీరుగారుతోంది. బాలకార్మికులను గుర్తించిన కార్మిశాఖాధికారులు కేవలం జరిమానాలు విధించడం, పిల్లల తల్లిదండ్రులను మందలిండమే పనిగా పె ట్టుకోవడంతో చిన్నారులు మళీంఒల పనిబాట పడుతున్నారు. బడీడు పిల్లలను గుర్తించి వారిని చదివించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) శాఖ పుష్కాలంగా నిధులు కేటాయిస్లున్నారు. చిన్నారుల బాధ్యతంతా ఆర్వీఎందే. ఆర్వీఎం శాఖ కాగజ్‌నగర్, మంచిర్యాల, చెస్నూరు, లక్సెట్టిపేట, కుబీరు, సిర్పూర్(యు)లలో రెసిడెస్షియల్ ప్పెషల్ ట్రైనింగ్ పెంటర్లు నిర్వహిస్తోంది. ఒక్కో సెంటర్లో 50 మంది చొప్పున ప్రతి విద్యార్థికి తిండి, వసతి, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం ఏటా రూ.18వేత నుంచి రూ.20 వేల వరకు కేటాయింస్తోంది. అయితే గతేడాది జూన్‌లో ప్రారంభమైన ఈ కేంద్రాల గడువు కాలం రానున్న జూన్ వరకే ఉందని శిక్షణ కేంద్రాఈల పర్యవేక్షకుడు, ఆర్వీఎం ఆల్టర్‌నెట్ స్కూల్ కో-ఆర్డినేటర్ సత్తార్ తెలిపారు. కాగా జూన్ తర్వాత విధ్యార్థుల పరిస్థాతి ఏంటో అధికారులకే తెలియదు.
తొమ్మిది నెలల్లో నిర్మూలిస్తాం -గాంధీ, కార్మిక శాఖ ఉప కమిషనర్
వచ్చే ఏడాది జనవరి 26లోపుఏ జిల్లాలో బాలకార్మికులందరినీ పరి కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఈ లోపు దశల వారీగా చర్యలతు తీసుకుంటాం. పద్నాగేళ్లలోపు చిన్నారులను ఎవరైనా పనిలో పెట్టుకోని కైసు నమోదు చేస్తాం. బాలకార్మి వ్యవస్థ నిర్మూలన అందరి బాద్యత.