బాల్య వివాహాన్ని నిలిపివేసిన అధికారులు
మహబూబ్‌నగర్, జనంసాక్షి: ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు చేసిన సాంఘీక దురాచారాలను నిర్మూలించలేకపోతుంది. సాంఘీక దురాచారం బాల్యవివాహాన్ని జిల్లా అధికారులు అడ్డుకున్నారు. ఓ పదమూడేళ్ల బాలికకు చేస్తున్న పెళ్లిని నిలిపివేశారు. వనపర్తి మండలం ఖాసీంనగర్‌లో ఈ సాంఘీక దురాచార ఘటన చోటుచేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న పదమూడేళ్ల బాలికకు ఆమె మేనమామతో వివాహం చేస్తున్నారనే సమాచారంతో గ్రామంలోకి వెళ్లిన అధికారులు పెళ్లిని ఆపివేశారు. బాలికకు, ఆమె మేనమామకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
కాగా, తన భర్త తాగుడుకు బానిసైపోయి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో కొంత భారం తగ్గిపోతుందనే ఉద్దేశ్యంతో పెద్ద కూతురు వివాహాన్ని చేయిస్తున్నట్లు బాలిక తల్లి కన్నీరు పెట్టుకున్నారు.