బా న్సువాడ నియోజకవర్గం (కామారెడ్డి జిల్లా).
నసురుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన ఆసరా పెన్షన్ కార్డులను ఈరోజ పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి.
నసుర్లాబాద్ లబ్ధిదారులకు నస్రుల్లాబాద్ లబ్ధిదారులకు నెమ్లి సాయిబాబా గుడి ఫంక్షన్ హాల్లో స్పీకర్ పోచారం పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ
దేశంలో అత్యధిక మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
వృద్ధులు, వికలాంగులతో పాటుగా వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బోదకాలు బాధితులకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
ఇంటికి పెద్ద కొడుకుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వృద్దులకు పెన్షన్ ఇస్తున్నారు.
ఇప్పటికే మన రాష్ట్రంలో 38 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయి.
కరోనా మహమ్మారితో రాష్ట్ర ప్రభుత్వం ఆధాయం తగ్గిపోవడంతో నూతన పెన్షన్లను మంజూరు చేయడానికి కొంత ఆలస్యం అయింది.
కొత్తగా మరో 10 లక్షల మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి.
అంటే రాష్ట్రంలో మొత్తం 48 లక్షల మందికి పెన్షన్లు అందుతాయి.
మన కంటే పెద్ద రాష్ట్రాలు అయిన గుజరాత్ లో కేవలం 12.40 లక్షల మందికి, మహారాష్ట్ర లో 31.50 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు.
ఆసరా పెన్షన్ల కోసం నెలకు రూ. 1,250 కోట్ల చొప్పున ఏడాదికి రూ. 15,000 కోట్ల ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుంది.
బాన్సువాడ నియోజకవర్గంలో గతంలో 36, 000 మందికి పెన్షన్లు వస్తుండగా నూతనంగా మరో 10,000 మందికి పెన్షన్లు మంజూరు అయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ రూ. 2016 మరియు వికలాంగులకు ఇస్తున్న రూ. 3016 దేశంలోనే అత్యధికం.
బీహార్ లో వృద్దాప్య పెన్షన్ రూ. 400 లు. ప్రధానమంత్రి స్వంత రాష్ట్రం గుజరాత్ లో కూడా పెన్షన్ రూ. 750 లు మాత్రమే.
అది కూడా 80 ఏళ్ళు దాటిన వారికి మాత్రమే ఇస్తున్నారు.
కేరళలో 75 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ రూ. 1000 ఇస్తున్నారు.
రాజస్థాన్ లో 75 ఏళ్ళు దాటిన వృద్ధులకు రూ. 750 ఇస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లో అందరికీ పెన్షన్ రూ. 500 లు మాత్రమే.
పంజాబ్ లో రూ.800, తమిళనాడు లో రూ.1000 మాత్రమే . కొన్ని రాష్ట్రాలలో అయితే రూ. 200 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు.
రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే సగం కుటుంబాలకు ఏదో రూపేణా పెన్షన్ అందుతుంది.
ఈమధ్య కొంతమంది అంగవైకల్యం లేకపోయినా తమకు వికలాంగుల పెన్షన్ కావాలని వస్తున్నారు.
జిల్లా ఆసుపత్రిలోని సదరం క్యాంపులో డాక్టర్లు పరిక్షించి అంగవైకల్యం ఉన్నదని నిర్ధారించి సర్టిఫికెట్ జారీ చేసిన వారు మాత్రమే వికలాంగుల పెన్షన్ కు అర్హులు.
ఆర్డీవో రాజా గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.