*బిఎస్పి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ*

బయ్యారం,ఆగష్టు11(జనంసాక్షి):
గురువారం పోటీ పరీక్షల అవగాహన సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ బయ్యారం మెయిన్ రోడ్డు దగ్గర జరిగింది.ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు బాదావత్ ప్రతాప్ మాట్లాడుతూ…75వ స్వాతంత్ర దినోత్సవం,ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా బీఎస్పీ ఆధ్వర్యంలో పోటీపరీక్షల అవగాహన సదస్సు ఈనెల 14న ఇల్లందులోని పెన్షనర్స్ భవనంలో జరుగుతుందని తెలియజేశారు.ఇల్లందు నియోజక వర్గంలోని చదువుకున్న వాళ్లు, నిరుద్యోగులు,ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న  యువతి,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుంది, ఉద్యోగాలు లేక యువకులు కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.పేదరికం పోవాలంటే బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక చక్కటి అవకాశమన్నారు.బడుగు బలహీన వర్గాలు అత్యున్నతస్థాయిలో ఉద్యోగాలు సంపాదించి పేద ప్రజలకు మార్గదర్శకులు అవ్వాలని కోరారు.
బహుజన సమాజ్ పార్టీ గార్ల, బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర్ వెంకన్న మాట్లాడుతూ… బహుజన సమాజ్ పార్టీ చదువుకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. బహుజన రాజ్యంలో ప్రజలు సంతోషంతో,అత్యుత్తమ ప్రమాణాలతో జీవితం గడుపుతారన్నారు. నియోజకవర్గంలోని యువతీ యువకులు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని , ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లేతాకుల కాంతారావు,బిఎస్పి గార్ల ,బయ్యారం మండల ఇంచార్జ్ అజ్మీర్ వెంకన్న, మురళి, జీవన్, వాసు, పృద్వి ,నరేష్ ,భాసింగ్ పాండు ,తదితరులు పాల్గొన్నారు.