బిజెపితో టిఆర్‌ఎస్‌ లోపాయకారి ఒప్పందం: మొయిలీ

నిజామాబాద్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): బీజేపీతో టీఆర్‌ఎస్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెస్‌ నేత వీరప్ప మొయిలీ ఆరోపించారు. నిజామాబాద్‌ పర్యటనకు వచ్చిన ఆయన విూడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ప్రజలను మోసం చేస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన నడుస్తుందని, కేసీఆర్‌ ప్రభుత్వాన్ని బేకార్‌ సర్కార్‌గా ఆయన అభివర్ణించారు. తెలంగాణలో వందలాది ఇంజినీరింగ్‌, ఫార్మసీ కాలేజీలు మూతబడ్డాయని, అవినీతిలో తెలంగాణ మొదటి స్థానం, రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. అమరవీరుల కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని మొయిలీ ఆరోపించారు.