బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా వేముల శంకర్.
బెజ్జంకి,సెప్టెంబర్25,(జనంసాక్ షి):మండల కేంద్రంలో ఆదివారం మండల అధ్యక్షులు ధోనే అశోక్ ఆధ్వర్యంలో బిజెపి ఎస్సీ సెల్ అధ్యక్షునిగా వేముల శంకర్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ చేతుల మీదుగా కరపత్రాన్ని వేముల శంకర్ కి అందజేశారు.అనంతరం శంకర్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో బిజెపి ఎస్సీ సెల్ మండల అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు పార్టీ కోసం,పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దొంతర వేణి శ్రీనివాస్,టౌన్ అధ్యక్షులు సంఘ రవి,వడ్లురి శ్రీనివాస్,శీలం వెంకటేష్,ఐలేని భాస్కర్ రెడ్డి,దొడ్ల ప్రశాంత్,ఇస్కిల్ల సాగర్ తదితరులు పాల్గొన్నారు.