బిజెపి క్షుద్ర రాజకీయాలుచేస్తోంది

 

 

 

 

నిప్పుతో చెలగాట మాడుతున్నారు

మహాధర్నాలో కేంద్రానికి మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్‌,నవబంర్‌18(జనం సాక్షి ): బీజేపీ నేతలు తమ క్షుద్రరాజకీయాలతో తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. కేంద్రం నిప్పుతో చెలగాటం ఆడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన మహాధర్నాలో (ఓజీఠజీ ఆఠజీసనిజీ) మంత్రి మాట్లాడారు. నిజాలు ఒప్పుకోవడం ఇష్టం లేక ప్రతిపక్ష నేతలు అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. తెలంగాణలో పెద్దఎత్తున పంట పండుతుంటే తట్టుకోలేక పోతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌కు పదవులు ఓ లెక్కకాదని చెప్పారు. విద్యుత్‌ రంగంపై కేంద్రం కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. 60 ఏండ్ల విద్యుత్‌ గోసను ఆరు నెలల్లో తీర్చామన్నారు. రాష్ట్రంలో వరి పంట పండిరచడంలో నల్లగొండ జిల్లా తొలి స్థానంలో ఉందని చెప్పారు. అతి తక్కువ ప్రాంతంలో ఎక్కువ బోరుబావులున్న జిల్లా నల్లగొండ అని వెల్లడిరచారు. బీజేపీ నేతలపై నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రస్థాయిలో స్పందించారని మంత్రి అన్నారు. దొడ్డి కొమురయ్య, ఐలమ్మ పోరాట వారసత్వాన్ని ప్రదర్శించారని చెప్పారు. ఆరేండ్లలో నల్లగొండ జిల్లాలో ఎª`లోరైడ్‌ లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దని తెలిపారు.