బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ లో కి 30 మంది యువకులు
రాయికల్ మండల వీరాపుర్ గ్రామానికి చెందిన ఇంద్రాల నిశంత్ అధ్వర్యంలో 30 మంది యువకులు బిజెపి పార్టీ నుండి టిఆర్ఎస్ లో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ఆకర్షితులై పార్టీ లో చేరారని,పల్లె ప్రగతి ద్వారా పల్లెల రూపు రేఖలు మారాయని,
వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థిక బలోపేతం కావాలని ముఖ్యమంత్రి గారు రైతు రాజు ను చేయాలని కృషి చేస్తున్నారని,సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు యువత తిప్పి కొట్టాలని,ప్రభుత్వ పథకాలు ప్రజల్లో కి తీసుకెళ్ళి పార్టీ ని బలోపేతం చేయాలని అన్నారు.సంపద పెంచి పేదలకు పంచడం లక్ష్యం గా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని…దళితుల ఆర్థిక,సామాజిక అభివృద్ధి సాధించాలని దళిత బందు లాంటి గొప్ప పథకం అమలు చేస్తున్నారని,ఎలాంటి బ్యాంక్ పూచి లేకుండా 10లక్షలు అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే నని అన్నారు. ..డబల్ బెడ్ రూం ఇండ్ల లో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కుల రహిత సమాజ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు అని అన్నారు.అన్ని వర్గాల అభ్యున్నతికి కుల వృత్తుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని రాబోయే రోజుల్లో అన్ని వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారు అని,అసత్య ఆరోపణలు నమ్మవద్దని గతానికి,ఇప్పటికీ అభివృద్ధి,సంక్షేమం పోల్చుకుని గుండె మీద చెయ్యి వేసి చెప్పాలని,ప్రజలు గమనించాలని కోరారు..ప్రతి కార్యకర్త కు అండగా ఉంటామని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు.
అనంతరం
వీరా పూర్ గ్రామానికి చెందిన నల్ల వినోద్ కు దళిత బందు పథకం ద్వారా మంజూరు మారుతి కార్ ను ఈరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారునికి అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.
తాల్ల గంగుకు సీఎం సహాయ నిది ద్వారా మంజూరు అయిన 1 లక్ష రూపాయల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు కోల శ్రీనివాస్ ,జిల్లా ఎంపిటిసిల పోరం అధ్యక్షులు దొంతి నాగరాజు,సర్పంచ్ నీలి చిన్న మల్లయ్య,ఉప సర్పంచ్ మహబూబ్,మండల పార్టీ ఉపధ్యక్షుడు కిషన్ రావు,pacs వైస్ చైర్మన్ స్వామి రెడ్డి,
,గ్రామ శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి ముత్యాలు,నాయకులు మైనార్టీ సెల్ల్ ఇబ్రహీం, గ్రామ ప్రధాన కార్యదర్శి నీలి మహిపాల్, బురుగుల రాజేందర్, సురేందర్ నాయక్, వినోద్ లచ్చన్న జై భీమ్ యూత్ సభ్యులు ఉన్నారు