బిజేపి నాయకులపై విరుచుకుపడ్డ టిఆర్ఎస్ నాయకులు,మున్సిపల్ కౌన్సిలర్లు

రాజకీయ ఉనికి కోసమే బిజెపి నాయకుల పాట్లు

బీజేపీ నాయకులు సంస్కారం లేని వారని మరోసారి సభ్యత లేని వారి మాటలే నిదర్శనం

ఇంత రాజకీయ అనుభవం ఉండి అవగాహన రాహిత్యంతో మాట్లాడడం సిగ్గు చేటు

జోగులాంబ గద్వాల  (జనంసాక్షి) జూలై  : గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ లో గద్వాల్ టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ఆలయ కమిటీ ఛైర్మన్ సతీష్ ,కౌన్సిలర్స్ దౌలు ,నాగిరెడ్డి, నరహరి గౌడ్ మహేష్ మాట్లాడుతూ…

గద్వాల ప్రజలు 40 ఏళ్లు మీ కుటుంబానికి రాజకీయ భిక్ష పెడితే.. కరోన పరిస్థితుల్లో హైదరాబాద్ కు పారిపోయి తలదాచుకుంది మీ నాయకురాలు కాదా అన్నారు ఈ విషయం గద్వాల ప్రజలు అప్పుడే ఎలా మరిచిపోతారనుకుంటారన్నారు
మీ డీకే అరుణ ఏనాడైనా కరోనా విపత్కర సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగిందా మీరా మాకు నీతులు చెప్పేది అని ప్రశ్నించారు.
మా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా విపత్కర పరిస్థితిల్లో జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు నిత్య అన్నదానం చేశారు. ప్రతిరోజు డాక్టర్లతో సమీక్షిస్తూ దాతల సహకారం రోగులకు కావలసిన ఆక్సిజన్ సిలిండర్లు ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. ఫలితంగా హైదరాబాద్, మహబూబ్ నగర్, కర్నూల్ వంటి ప్రాంతాల నుంచి కరోనా రోగులు వచ్చి చికిత్స పొందిన విషయం గద్వాల ప్రజలకు తెలిసిన విషయమే కరోనా సమయంలో రూ. కోటి రూపాయలు మున్సిపాలిటీలో ఏమి చేశారని ప్రశ్నిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆ నిధులు ఎక్కడెక్కడ అభివృద్ధి పనులకు వినియోగించారో మీ బిజెపి కౌన్సిలర్లను, మీ పక్కనున్న ఫ్లోర్ లీడర్ ను అడిగితే తెలుస్తుంది. మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినప్పుడు మీ కౌన్సిలర్లు ఏం చేశారు. మరి ఇందులో వారి వాటా ఎంతో వారిని అడిగి తెలుసుకోమన్నారు.
సామాన్య ప్రజల నుండి రెవెన్యూ పనులు చేపిస్తా అని 200, 300 తీసుకున్నవారు నీతి వాక్యాలు మాట్లాడే నైతిక హక్కు నీకు ఉందా అన్నారు
బిజెపి జిల్లా అధ్యక్షులు నోరును అదుపులో పెట్టుకోవాలి గద్వాల ప్రజలు ఇక్కడి, ఇక్కడి ప్రజల సంస్కృతి నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావ్ డీకే బంగ్లాకు పెయిడ్ ఆర్టిస్ట్ గా మారి ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు చేస్తుంది ఎదుర్కోవాలి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త ….
మీ 40 ఏళ్ల కాలంలో అభివృద్ధి పనులపై ఎన్ని జీవోలు తెచ్చారు. పత్రిక రూపకంగా ఇచ్చే దమ్ము మీకుందా అని అన్నారు
దేని పై అయినా చర్చకు సిద్ధం చెప్పండి మీరే ప్లేస్ చెప్పండి మేము ఏ చర్చ కైనా సిద్ధం,రాజకీయ బిక్షగాళ్లు ఎవరు గద్వాల ప్రజలకు స్పష్టంగా తెలుసునని. వారి బిక్షతోనే గతంలో పదవులు అనుభవించిన విషయం మర్చిపోయారా..ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఏ కులాన్ని అవహేళన పరచలేదు. అన్ని కులాలను అక్కున చేర్చుకునే విధంగా ఆయన పని చేస్తున్నారు. మీలాగా కులాల పేరు, మతాల పేరు చెప్పి రాజకీయం చేసేది మీరే.
గత మీ పాలనలో ఏ కుల సంఘం వారైనా ఆర్థికంగా ఎదిగినా ఎరైనా తెల్లచొక్కా వేసుకొని తిరిగితే సహించలేకుండా వారిని వేధింపులకు గురిచేసిన చరిత్ర బంగ్లా నాయకులది కాదా అని ప్రశ్నించారు
ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు మీరు చేసిన ప్రాజెక్టు పనులు ఏ ఒక్కటైనా సరిగా ఉందా కమిషన్ల కక్కుర్తిపాడు నేడు నియోజకవర్గ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు …
మీ చేతగానితనంతో ఉన్న ప్రాజెక్టులను ఆంధ్రాకు తరలించారు.. ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయిన ప్రాజెక్టులకు హారతి పట్టింది డీకే అరుణ కాదా..?సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడే ముందు మీరు పాలిస్తున్న రాష్ట్రాలలో ఏముంది తెలంగాణలో ఏముంది అని మీరు నిజమైన మగాలైతే వెళ్లి చూడండన్నారు .
మీ కమిషన్ల కొరకు అధికారులను బెదిరింపు చర్యలకు పాల్పడుతుంటే అధికారులు భయపడి ఎందరో ఇక్కడి నుండి వెళ్లిపోయారో అది అందరికి తెలిసిన విషయమే అన్నారు..
ఉన్నత చదువులు చదివితే ప్రజలు ప్రశ్నిస్తారని దురుద్దేశంతో మీ హయాంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసింది నిజం కాదా అన్నారు.
కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో, గద్వాల ఎమ్మెల్యే కృషితో, గద్వాలకు నర్సింగ్ కళాశాల, మైనార్టీ కళాశాలలో పాఠశాల, గట్టులో జూనియర్ కళాశాల అలాగే ప్రతి మండలంలో గురుకుల పాఠశాల తీసుకొచ్చి వేలాదిమంది పేద మధ్యతరగతి ప్రజలు నాణ్యమైన విద్యను ఇంగ్లీష్ భోదన పొందుతున్నారన్నారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే, మా మున్సిపల్ చైర్మన్ ను విమర్శిస్తే సహించేది లేదు. ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు అని హెచ్చరిస్తున్నాం అంటూ ఘాటు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ దౌలు, నరహరి శ్రీనివాసులు, గద్వాల మండలం పార్టీ అధ్యక్షుడు రాముడు, తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాగులు యాదవ్, రిజ్వాన్, భగీరథ వంశీ, కురుమన్న ధర్మ నాయుడు, పవన్ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.