బిట్స్ కళాశాల బస్సు, లారీ ఢీ : నలుగురికి గాయాలు
వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లకినేపల్లి సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. బిట్స్ కళాశాల బస్సు, లారీ ఒకదానికొకటి ఢీ కొనటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయసడినవారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆటో, లారీ ఢీ కోనటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.