బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టాలి జిల్లా జడ్పీ చైర్మన్ వనజ ఆంజనేయులు గౌడ్ 

మక్తల్ ఆగస్టు 03(జనంసాక్షి) మక్తల్ మండలం లోని మంతన్ గోడ్ గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి k.వనజ అంజనేయులు గౌడ్ గారు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ బిడ్డ పుట్టగానే ముర్రు పాలు పట్టాలని అన్నారు. కనీసం 6 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత తల్లి పాలతో పాటు అనుబంద పోషక ఆహారం ఇవ్వాలని సూచించారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి  ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి మహా దేవమ్మా, ,ఉప సర్పంచ్ శ్రీ k.కృష్ణయ్య గౌడ్ ,ANM, అంగన్ వాడి టీచర్ లు, ఆశ కార్యకర్తలు, గర్భవతులు, బాలింతలు మరియు తల్లులు  పాల్గొన్నారు.