*బియ్యపు గింజ పరిమాణంలో ‘జాతీయ జెండా’ను రూపొందించిన స్వర్ణకారుడు..
దేవరుప్పుల, ఆగస్టు (జనం సాక్షి): దేవరుప్పుల మండలం,కామారెడ్డి గూడెం గ్రామానికి చెందిన తుడిమిల్ల మహేంద్రాచారి వృత్తిరీత్యా స్వర్ణకారుడు.75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవం’ సందర్భంగా తనుకూడా ఒక అద్భుతాన్ని చేసి భారత దేశం పై ఉన్న దేశభక్తిని చాటాలనుకొని బియ్యపు గింజ సైజులో జతీయ జెండాను తయారు చేసి అందరిచే ఔరా అనిపించుకున్నాడు.ఈసందర్భంగా స్వర్ణకారుడు మాట్లాడుతూ ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా నేను కూడా నాదేశం ఉన్న దేశభక్తిని చాటాలనుకొని బియ్యపు గింజ పరిమాణంలో జాతీయ జెండాను తయారు చేశానని..
ఈ జాతీయ జెండాను తయారు చేయడానికి సుమారు రెండు గంటల ఇరవై నిమిషాల సమయం పట్టిందని ఈ జాతీయ జెండాను 50 మిల్లి గ్రాముల బంగారంతో రూపొందించానని
అంతే కాకుండా నేను ఇంతకుముందు కూడా ఆ పరమ శివుని భక్తితో మహాశివరాత్రి సందర్భంగా సూది బెజ్జంలో పట్టే శివలింగాన్ని తయారుచేశానని పేర్కొన్నారు.