బీఆర్ఎస్ కు విరాళాల వెల్లువ

 నంగునూరు, అక్టోబర్ 11(జనంసాక్షి):
 ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిలో భాగంగా
సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు గ్రామంలో మంగళవారం రోజున అన్ని కులాల వారు దాదాపు రూ.35000/- లను జమ చేసి మండల బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి కి ముట్టజెప్పారూ. వారు మాట్లాడుతూ… టిఆర్ఎస్ ను
 బిఆర్ఎస్ పార్టీగా మార్చడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. కెసిఆర్ హరీష్ రావు ఆధ్వర్యంలో జాతీయ పార్టీ ఏర్పాటు కావడంతో సిద్దిపేట జిల్లా ప్రజలకు భవిష్యత్తులో ఎన్నో విధాలుగా మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న పార్టీ కోసం అందరం కలిసికట్టుగా, ముకుమ్మడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని గుర్తుచేశారు.మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, జయపాల్ రెడ్డి, ఎంపిటిసి కోల సునీత మహేందర్ గౌడ్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లింగం గౌడ్, సీనియర్ నాయకులు వేముల వెంకట్ రెడ్డి, సంఘ పురెందర్బ, కృష్ణారెడ్డి అన్ని కుల సంఘాల నాయకులు ఉన్నారు.
Attachments area