బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అద్భుతం

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో అద్భుతం

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 17 :
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన ఆరుమాసాల్లోనే అక్కడి ప్రజలు ఆగమైపోతున్నారని, కాంగ్రెస్‌ను నమ్మితే కర్ణాటక తరహాలోనే మోసపోక తప్పదని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు.
మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మ్యానీఫేస్టోతో పాటు తన సొంత మ్యానీఫేస్టో కరపత్రాలను భూపాలపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జక్కు శ్రీహర్షిణీ రాకేష్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో మోసపూరిత హమీలతో అక్కడి ప్రజలను కాంగ్రెస పార్టీ మోసం చేసిందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా దేశంలో రాష్ట్రంలో బీసీలను, మున్నూరు కాపులను కాంగ్రెస్‌పార్టీ అణిచివేస్తుందని ఆయన తెలిపారు. 50ఏండ్ల పాటు కాంగ్రెస్‌పార్టీకి సేవ చేసిన పొన్నాల లక్ష్మయ్యను ఎంతగా అవమానించారో ప్రజలు, మున్నూరుకాపులు గమనించాలన్నారు. బీసీలు, మున్నూరు కాపులు రాజకీయంగాఎదిగితే నాటి నుంచి నేటి వరకు వారి ఎదుగుదలను అడ్డుకోవడమే కాంగ్రెస్‌ నైజంగా మారిపోయిందని, తనలాంటి వాళ్లు రాజకీయంగా ఎదిగితేఎన్ని కుట్రలు, కుతంత్రాలుచేస్తు రాజకీయ సమాధి చేసేందుకు ఎంతలాప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీసీలు, మున్నూరు కాపులతో పాటు ఎస్సీ ఎస్టీలను కూడా రాజకీయంగా ఎదుగకుండా అడ్డుకుంటున్నారని అన్నారు. మొన్నటి వరకు తనపై అంబండాలు, అబద్దపు ప్రచారాలుచేసిన కాంగ్రెస్సోళ్లు ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో వచ్చి ఇక్కడ ఖర్చు చేస్తున్నారని, కర్ణాటకలో సంపాదించిన వందల కోట్లతో ఇక్కడ ఓటర్లనుప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అనేక ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్‌ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలన్నదే తమ ఆరాటమన్నారు. ఆనాడు అధికారంలో ఉండి ఏం చేయనోళ్లు ఈనాడు ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ మాయమాటలు చెప్తున్నారని విమర్శించారు. ప్రజాసంక్షేమం, అభివృధ్దిని ఆకాంక్షించే బీఆర్‌ఎస్‌ పార్టీ, సీఎం కేసీఆర్‌ పేద ప్రజల అవసరాలను గుర్తించి ప్రజా ఆమోదయోగ్యమైన ఎన్నికల మ్యానీఫేస్టోకు రూపకల్పన చేసి ప్రవేశపెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన ఎన్నికల మ్యానీఫేస్టో ఎంతో అద్బుతమని, అందులో పొందుపర్చిన ప్రతిపథకం పేద ప్రజలకు అవసరమైనవమేనని ఆయన వివరించారు. రైతుబీమా తరహాలో కేసీఆర్‌ బీమా పథకం ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని, తెల్లరేషన్‌కార్డు కల్గిన కుటుంబంలో ఎవరైన మరణిస్తే వారం రోజుల్లోగా రూ.5లక్షల బీమా అందించడం జరుగుతుందని అన్నారు. రూ.400లకే గ్యాస్‌ సిలిండర్‌, వృద్దాప్య, వితంతు పించన్‌లు రూ.5 వేలు, దివ్యాంగుల పించన్‌ రూ.6 వేలు పెంచడం హర్షణీయమన్నారు. అంతేకాకుండా సౌభాగ్య లక్ష్మి పేరిట ప్రతి మహిళకు రూ.3 వేలు, రూ.15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు, అగ్ర వర్ణాల్లో పేదలకు గురుకుల పాఠశాలల ఏర్పాటులాంటి 16పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని ఆయన వివరించారు. ముఖ్యంగా దళితులకు అసైన్మెంట్‌ భూములపై హక్కు పత్రాలు ఇవ్వాలనే ఆలోచన ఎంతో గొప్పదని, తద్వారా దళితులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన అబిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్టీ మ్యానీఫేస్టోతో పాటు తాను సొంతంగా మరిన్న సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టానని, ఇప్పటికే ప్రకటించనట్లుగా ఉన్నత చదువులు చదువుకునే పేదింటి బిడ్డలకు హైదరాబాద్‌లో ఉచితంగా హస్టల్‌ వసతి కల్పించి రూపాయి ఖర్చు లేకుండా చదివిస్తానని, పేదింటి ఆడబిడ్డలకు సామూహిక వివాహాలు, గృహలక్ష్మి పథకం ద్వారా ఇళ్లు మంజూరీచేయించి తామే ఇంటినిర్మాణం చేసి గృహప్రవేశం చేస్తామని, ఇలాంటి మరిన్ని సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. అనేక ఏండ్లు మంథనిప్రజల ఓట్లతో గెలిచి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎన్నికల మ్యానీఫేస్టోనే ప్రకటించారే కానీ ఇక్కడి ప్రజల కోసం ఏం చేస్తారనే విషయం చెప్పడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల మ్యానీఫేస్టోను ప్రకటిస్తే తమ పథకాలను కాపీ కొట్టారని మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.పదేండ్ల పాటు అధికారంలో ఉండి రూ.200ల పించన్‌ను రూ.201 పెంచలేని కాంగ్రెస్‌పార్టీ ఈనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న పించన్‌కంటే ఎక్కవ ఇస్తామంటేప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. ఆచరణలో సాధ్యం కాని పథకాలు చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని, కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సీఏం కేసీఆర్‌ మాత్రం ఆచరణలో సాధ్యమయ్యే పథకాలు మాత్రమే ప్రకటించి అమలు చేస్తారన్నారు. ఏనాడైన 24గంటల కరెంటు, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాధీముబాకర్‌, దళితబంధులాంటి పథకాల గురించి కలలోనైనా ఆలోచన చేసిండ్లా అని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వపరంగా తన సొంతంగా ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేస్తానని, ఈ ప్రాంత అభివృధ్దికి కృషి చేస్తానని ఆయన హమీ ఇచ్చారు. దేశం గర్వించే రీతిలో అనేక పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో సీఎం కేసీఆర్‌ నిలిచిపోయారని, రాబోయే రోజుల్లో కూడా అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు మంచి పాలన అందించేలా రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేసి ఆశీర్వాదం అందించాలని ఆయన పిలుపునిచ్చారు.