బీజేపీ నాయకుని నెలరోజుల అన్నదానం
కామారెడ్డి,ఆగస్ట్11(జనం సాక్షి): బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి మాల్యాద్రి రెడ్డి ఆలయానికి వచ్చే భక్తులకు శ్రావణమాసం సందర్భంగా నెలరోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీజేపీ పట్టణ నాయకుడు కొత్తకొండ భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ కమిటీ వారు చేసే నిత్యాన్నదానానికి పట్టణానికి చెందిన నిరుపేదలు, భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్పందించిన మాల్యాద్రి… తాను కూడా బీదల ఆకలి తీర్చడానికి పూనుకున్నట్లు తెలిపారు. బుధవారం నాడు అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.