బీజేవైఎం ఆద్వర్యంలో ఘనంగా అజాద్ కీ అమృత్ వజ్రోత్సవ ర్యాలీ…భారీ ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించిన బీజేపీవైఎం చేవెళ్ల అసెంబ్లీ నాయకులు.. హాజరైన బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి..బీజేవైఎం జిల్ల్లా అధ్యక్షులు టీ.యాదేశ్

చేవెళ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్ర 75 సంవత్సరాల ఆజాద్ కీ అమృత్  వజ్రోత్సవాల సందర్భంగా చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం బిజెపి నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆజాద్ కి ఆమృత్ మహోత్సవాల లో భాగంగా శనివారం నాడు చేవెళ్ల మండల బీజేవైఎం అధ్యక్షులు పత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది . ఈ కార్యక్రమంలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం లోని మొయినాబాద్,  షాబాద్ శంకర్పల్లి మండలాల బీజేవైఎం, బిజెపి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. జాతీయ జెండాలను పట్టుకుని బీజేవైఎం అసెంబ్లీ నాయకులు, బిజెపి నాయకులు భారీగా బైకు ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి ని చాటే నినాదాలతో చేవెళ్ళ మండల కేంద్రం మారు మ్రోగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా బిజెపి నేత మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు టి యాదెష్ , స్వచ్ఛ భారత్ సెల్ రాష్ట్ర  కన్వీనర్ రాము ,  చేవెళ్ళ మండల పార్టీ అధ్యక్షులు పాండు రంగారెడ్డి హాజరయ్యారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి ని చాటుకుంటూ  యువత ఐక్యంగా  ఆజాద్ కీ అమృత్  వజ్రోత్సవ కార్యక్రమంలో  పాల్గొనడం ఎంతో గొప్ప విషయమని వారు పేర్కొన్నారు.  ప్రధాని మోదీ  పిలుపు మేరకు 75 సంవత్సరాల స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో బీజేపీ, బీజే వైఎం లు దేశభక్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు.  స్వాతంత్య్రం సిద్దించేందుకు ఎందరో  కృషి చేశారని వారి జీవితాలను యువత  ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిలా ఉపాధ్యక్షులు జంగారెడ్డి, చేవెళ్ల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి అనంత్ రెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు  కొండనోళ్ళ రాంరెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయులు గౌడ్, ప్రభాకర్, అద్దెట్ల శ్రీనివాస్, చేవెళ్ళ, మొయినాబాద్, శంకర్ పల్లి, షాబాద్, మండలాల బీజేపీ యువమోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.