బీజేవైఎం నాయకుల అరెస్ట్ అప్రజాస్వామికo

తొర్రూరు:11 జూన్ రాష్ట్రంలో పిల్లల పై మహిళలపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలను నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని పోలీస్ అడ్డుకొని అరెస్ట్ చేయడం అప్రజాస్వామిక చర్య అని బిజెవైఏం తొర్రూరు అర్బన్ మండల అధ్యక్షుడు కాగు నవీన్ అన్నారు పోలీస్ ల అరెస్ట్ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాచారఘటనలు  ఆందోళనలు కలిగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిందితుల కేసులు, శిక్షల పట్ల వ్యవహరిస్తున్న తీరువలన రాష్ట్రంలో మహిళలు, యువతులకు రాష్ట్రంలో రక్షణ కరువైంది.
మొన్న జూబ్లీహిల్స్, నిన్న నిజామాబాద్, చిలకల గూడ, నేడు ఎల్బీ నగర్ లో మైనర్ బాలికలు, యువతులపై జరిగిన అత్యాచార ఘటనలకు  ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండిస్తూ, హోం శాఖ అసమర్థ వల్ల జరిగిన ఘోరాలకు బాధ్యత వహిస్తూ తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ అరెస్ట్ అయిన వాళ్లలో బీజేవైఎం తొర్రూరు రూరల్ ప్రధాన కార్యదర్శి కొండ రాజు మచ్చ ఉదయ్ బొల్లు ప్రవీణ్ మహమ్మద్ అమీర్ ఉన్నారు.