బీటి రోడ్డు పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తిచేయాలని
అధికారులకు ఎమ్మెల్యే హరిప్రియ ఆదేశం
టేకులపల్లి, అక్టోబర్ 16( జనం సాక్షి ): ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలోగల ప్రగల్లపాడు గ్రామపంచాయతీలో పడమటి గుంపు నుండి తెలుగూరు మీదుగా తూర్పు గూడెం వరకు రూ.1 కోటి 25 రూపాయల వ్యయంతో బీటి రోడ్డు + కల్వర్టు నిర్మాణం కోసం ఇల్లందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియ మంజూరు చేశారు. ఆ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంబంధిత అధికారులను ఆదేశించడంతో మండల ఏ ఈ రాజు వెంటనే ఫీల్డ్ మీదకు వెళ్లి రోడ్డు పనులు చేపట్టే కాంట్రాక్టర్కు పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా మండల పరిధిలోని సులానగర్ గ్రామపంచాయతీ లోని కొత్తగూడెం, ఇల్లందు ప్రధాన రహదారి నుండి తూర్పు గూడెం మీదుగా బేతంపూడి రైల్వే స్టేషన్ వరకు 5.50 కిలోమీటర్ల మేర బీటి రోడ్డుకు కూడా ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ కృషితో మంజూరు అయినట్లు టిఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి జాటోత్ నరేష్ నాయక్ తెలిపారు. మంజూరైన బీటీ రోడ్డుకు అప్రూవల్ కు పంపించడం జరిగిందని, అప్రూవల్ రాగానే రోడ్డుపనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. చింతల్ లంక నుండి సులానగర్ మీదుగా తూర్పు గూడెం రోడ్డుకు లింకు కలపడానికి బీటీ రోడ్డు మంజూరు చేయించడానికి ఎమ్మెల్యే హరిప్రియ కృషి చేస్తున్నారని, త్వరలో ప్రపోజల్ పెట్టనున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోడ్డు అనుసంధానంతో బేతంపూడి రైల్వే స్టేషన్ చుట్టుప్రక్కల ఉన్న ఎన్నో గ్రామ వాసులకు రైలు మార్గం ప్రయాణానికి చిరకాల వాంఛ తీరనున్నట్లు అందుకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే హరిప్రియ పట్ల ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రోడ్ల అభివృద్ధితో రైలు మార్గం అందుబాటులోకి రావడంతో పాటు ఆయా గ్రామాల వాసులకు వ్యవసాయ రైతులకు పొల�