బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు కిట్టు పంపిణీ

టేకులపల్లి, అక్టోబర్ 21( జనం సాక్షి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రక్తపోటు,షుగర్ వ్యాదిగ్రస్తులకు మెరుగైన చికత్స అందజేయాలనే సదుద్దేశంతో ఉచితంగా మందుల కిట్లను నేరుగా సబ్ సెంటర్లలో పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని A కాలనీ తండా లో, సులానగర్ సబ్ సెంటర్లో, అదేవిధంగా మండలంలో మందుల కిట్టును ముమ్మరంగా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ
కార్యక్రమంలో టేకులపల్లి సర్పంచ్ బొడ సరిత, సులానగర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఉండేటి బసవయ్య పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పధకం ను అందరు వినియోగించు కావాలని పిలుపునిచ్చారు.
ఈకార్యక్రమాల్లో గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యులు నోముల భానుచందర్, 9వ వార్డు సభ్యులు కమల, 10వ వార్డు భూక్య. కవిత, పంచాయతీ కార్యదర్శి యల్. కిరణ్, అంగన్ వాడి టీచర్లు ఇందిర, ఆశ వర్కర్ నాగమణి, పంచాయతీ సిబ్బంది మూడు బిచ్చు, నగేష్, కిరణ్, సులానగర్ పంచాయతీ కార్యదర్శి పవిత్ర, ఏఎన్ఎం అరుణ, అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.