బీరువా తాళం పగలగొట్టి వెండి, నగదు దోచుకెళ్లిన గుర్తు తెలియని దొంగలు
హుజూర్ నగర్ అక్టోబర్ 1 (జనం సాక్షి): గుర్తు తెలియని దొంగలు నగదు వెండి దోచుకెళ్ళారని హుజూర్ నగర్ ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే హుజూర్ నగర్ పరిధిలోని మాధవరాయిని గూడెంకి చెందిన గార్లపాటి గుర్నాధం సుమారు రెండు నెలల క్రితం తన ఇంటికి తాళం వేసి భార్య పిల్లలతో కలిసి బెంగుళూర్ వెళ్లగా శుక్రవారం రాత్రి ఎవరో గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న 15 తులాల వెండి వస్తువులు, కొంత నగదు దోచుకెళ్ళారని గుర్నాధం బామ్మర్ది యార్రపటి సతీష్ పిర్యాదు మేరకు ఎస్సై వెంకట్ రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.