బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి…..జాజుల లింగం గౌడ్
మిర్యాలగూడ. జనం సాక్షి .
బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించి మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో రా జకీయంగా రాణించలేకపోతున్నారని అన్నారు.జనాభాకు తగ్గట్టుగా బీసీలు ఎమ్మెల్యేలు,ఎంపీలు కాలేకపోతున్నారు.బీజేపీ ప్రభుత్వం,ప్రధానమంత్రి నరేంద్రమోదీ రిజర్వేషన్లు కల్పిస్తే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికోసం అప్పటికప్పుడు 10 రిజర్వేషన్లు కల్పించిన కేంద్రప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమిస్తున్న రిజర్వేషన్ల కల్పనకోసం కృషి చేయడం లేదన్నారు.60 కోట్లమంది బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దుర్మార్గం.వెంటనే బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని జాజుల డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,ఎర్రబెల్లి దుర్గయ్య,కుమ్మరికుంట్ల సుధాకర్,జనపాటి రవి,తుకారం,కృష్ణమూర్తి,నక్క సుధాకర్,మురళి యాదవ్ తదితరులుపాల్గొన్నారు