బీసీలు ఇళ్లపై జాతీయ జెండా ఎందుకు ఎగరేయాలి?

బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎం ఎం గౌడ్.

 

అచ్చంపేట ఆర్సి, ఆగస్టు 10 ,( జనం సాక్షి న్యూస్ ) 75 సంవత్సరాల స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు జాతీయ జెండా ను ఇళ్లపై ఎగరవేయాలని మరియు వాట్సాప్ డీపీలలో జాతీయ పతాకం ఫోటోను పెట్టు కోమనడం తోపాటు దేశంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైపట్ల బీసీ కులాల ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఎం ఎం గౌడ్ స్పందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ బీసీ ప్రధానమంత్రి అయి ఉండి కూడా బీసీ కుల గణన చేయకపోవడం వలన జాతీయ జెండాను బీసీలు తమ ఇళ్ల పై ఎందుకు ఎగురవేయాలని, వాట్సాప్ డిపి లో ఎందుకు పెట్టుకోవాలో ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ చెప్పాలని ప్రశ్నించారు, దేశంలో 60 శాతం బీసీ జనాభా లో కులాల వారిగా లెక్కించక పోవడం వలన, బీసీలకు రావాల్సిన వాటా రావడం లేదు ,కేంద్రంలో బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతుంది, బీసీలకు రావాల్సిన టువంటి సంక్షేమ పథకాలు అందటం లేదు, బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు కల్పించడం లేదు, విద్యా ఉద్యోగ ఉపాధి రంగంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది, బీసీ కులాల లో ఉన్నటువంటి ఎంబిసి కులాలు ఎస్సీ ఎస్టీల కన్నా అధ్వానంగా బ్రతుకుతున్నారని, వీళ్లను దోపిడీ చేసే వారిగా చూస్తున్నారని, దేశ జనాభా సగభాగం పైన బీసీల యొక్క రక్తమాంసాలతో చెమట చుక్కల తో నిర్మించుకున్న టువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ,ప్రైవేటు పరం చేసి, ఆదాని అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం, పేదోడి సోము ఉన్నోడికి దోచి పెట్టడం కాదా ?అని వారు విమర్శించారు, దీనివల్ల బీసీలకు విద్య ఉద్యోగ ఉపాధి ప్రభుత్వ రంగాల్లో కోల్పోయి, చదువుకున్న బీసీ బిడ్డలు, అడ్డ మీద కూలీలుగా పని చేస్తున్నారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.