బీసీల కులగణన చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా,ప్రదర్శనలో పాల్గొన్న బీసీ నాయకులు.

..జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ. జనం సాక్షి
త్వరలో చేపట్టబోయే కులగణనలో బీసీలను లెక్కించాలని డిమాండ్ చేస్తు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించినట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరిగే జనగణలో బిసి గణన కూడ చేపట్టాలని తాము దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నామని, బీసీల ఉద్యమానికి మద్దతుగా దేశంలోని 22 రాజకీయ పార్టీ లు ప్రధాని నరేంద్ర మోదికి లేఖలు రాశాయని, అలాగే ఏడు రాష్ట్రాల అసెంబ్లీలో ఎకగ్రీవ తీర్మానం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.దేశ స్వాతంత్రం రాకపూర్వమే 1931 లో బీసీ కులగణన జరిగిందని మళ్లీ 2011లో బీసీ గణన జరిగినప్పటికీ నేటి వరకు వాటి వివరాలు వెల్లడించకుండా తొక్కి పెట్టారని అని ఆయన ఆరోపించారు,బీసీ గణన లెక్కలు లేకపోవడం మూలంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం రావలసిన వాటా గాని, హక్కులు గాని, రిజర్వేషన్లు గాని రాకుండా పోతున్నాయని బీసీల లెక్కలు లేకపోవడంతో న్యాయస్థానాలు బీసీ రిజర్వేషన్లు కొట్టి వేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బిజెపి బీసీ గణన చేయాలని డిమాండ్ చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పటి హోం మంత్రి ప్రస్తుత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీసీగణన చేస్తామని పార్లమెంట్లో ప్రకటించి నేడు మాట మారుస్తున్నారని బీసీ జనగణన పై బిజెపి అవలంభిస్తున్న ద్వంద విధానాన్ని పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు ఎండగట్టాలని వారికి లింగంగౌడ్ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దుర్గయ్య,బంటు వెంకటేశ్వర్లు,గండిచెర్వు వెంకన్న,ఎర్రయ్య యాదవ్,నాగేశ్వరరావు,కుమ్మరికుంట్ల సుధాకర్,జానాపాటి రవి,నక్క సుధాకర్,సంపత్,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు