బీసీసీఐలోకి


తిరిగిరాను
` జగ్దాలే
ఇండోర్‌, జూన్‌ 2 (జనంసాక్షి) :
బీసీసీఐలోకి తిరిగి రానని కార్యదర్శి పదవికి రాజీ నామా చేసిన జగ్దాలే స్పష్టం చేశాడు. తిరిగి బీసీసీఐలోకి వచ్చే ఆలోచన కూడా లేదని తెలిపారు. మళ్లీ బీసీసీఐలో అడుగుపెట్టొద్దన్న షరతు విన్నానని, వాటితో నాకెలాంటి సమస్య లేదని పేర్కొన్నారు. కానీ భారత క్రికెట్‌పై తిరిగి నమ్మకం కలిగించడం అన్నది ముఖ్యమని చెప్పారు. ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ కుంభకోణంతో క్రికెట్‌ విశ్వసనీయత బాగా దెబ్బతిందని తెలిపారు. క్రికెట్లో స్పాట్‌ ఫిక్సింగ్‌ను అడ్డుకోవడం చాలా కష్టమని, బీసీసీఐకి కొన్ని పరిమితులున్నాయన్నారు.