బీసీసీఐ ఐటీ బకాయిలు రు.345 కోట్లు

ఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఆతాయపు పన్ను శాఖకు రు.345 కోట్లు పన్ను బకాయిపడంది. సమాచార హక్కు కింద ఓ దరఖాస్తుకు సమాధానమిస్తూ ముంబాయిలోని ఐటీ శాఖ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ బకాయిలు 2008-09 నుంచి 2010-11 వరకు కట్టవలసిన పన్నుగా తెలిపారు. 2011-12, 2012-13 సంవత్సరాల పన్నుబకాయిలు ఇంకా లెక్కగట్టలేదని చెప్పారు. ఇవి కూడా లెక్కగడితే బీసీసీఐ పన్ను బకాయిలు మరింత పెరగనుంది.