బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం నేడు
ముంబయి: మాజీ కెప్టెన్ మహ్మాద్ అజహరుద్దీన్ భారత్ క్రికెట్ వ్యవహారాల్లోకి వస్తాడా లేదా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతని విషయంలో ఏం చేయనుంది అన్న విషయాలపై బుధవారం స్పష్టత రానుంది. అజహర్‌పై పడిన జీవితకాల నిషేధాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలగించిన నేపథ్యంలో బుధవారం బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో అతని గురించి చర్చించనుంది. అజహర్ విషయంలో ఎలా వ్యవహరించాలన్నదానిపై వర్కింగ్ కమిటీ ఓ నిర్ణయానికి రానుంది.