బీసీ కుల గణన పై స్పష్టత ఇవ్వాలి:బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందరయ్య డిమాండ్

బీసీ కుల గణనను తక్షణమే అమలు చేయాలని బీసీ సంక్షేమ  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి సుందరయ్య డిమాండ్ చేసారు
మంగళవారం  నేరేడుచర్ల బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం శ్రీకాంతాచారి భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,దేశంలో బీసీ కుల గణన ను తక్షణ మే అమలు చేస్తామని 8 ఏళ్ల మోడీ పాలన లో దాని ఉసే ఎత్తకపోవడం సిగ్గుచేటు అని  అన్నారు.దేశ జనాభాలో 53% ఉన్నా బీసీలకు దామాషా ప్రతిపాదికన రిజర్వేషన్లు బీసీలను మోసగించడమే అన్నారు.బీసీ కుల గణనపై స్పష్టత ఇవ్వకపోవడం మోడీకి బీసీల మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం అవుతుందని అన్నారు.విద్య,ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని ఈ ప్రభుత్వం ఇప్పుడు కుదరదని బీసీలను నయవంచనకు గురిచేసిందని అన్నారు.మోడీ మంత్రివర్గంలో బీసీలకు చోటు కల్పించకపోవడం అన్యాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో  పెద్ద సంఖ్యలో ఉన్న బీసీలకు కుల గణన ప్రకారం నిధులు, నియామకాలు జరిగితే దేశం అభివృద్ధి అవుతుంద అన్నారు, బీసీల కుల గణన కోసం భవిష్యత్తులో బీసీలు పెద్ద ఎత్తున పోరాటం చేయాలన్నారు .కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అన్ని రకాల నామినేషనేడ్ పోస్టుల్లో  కాంట్రాక్టర్లలో బీసీలకు 50% అవకాశ కల్పించాలని ఆయన కో రారు.నాటి యుపిఏ ప్రభుత్వం హయాం లో బీసీ జన గణన చేపట్టాలని పార్లమెంట్లో నీల తీసిన బిజెపి నేడు అధికారంలోకి వచ్చి ఎందుకు బీసీ జనగణన చేపట్టడం లేదని, ఇది అవకాశవాదం కాదా అని ఆయన నిలదీశారు.బీసీ సంక్షేమ సంఘం నాయకులు సూరోజు సీతారా ములు, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చిలకరాజు శ్రీను, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పంగ బుచ్చిబాబు బీసీ నాయకురాలు మాగంటి జయమ్మ తదితరు లు పాల్గొన్నారు.