బీసీ సమీకృత భవనం కోసం చర్యలు చేపట్టాలి. బీసీ స్మశానవాటిక అభివృద్ధిపరచండి. బీసీల సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తాం. నియోజకవర్గ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.
బీసీ సమీకృత భవనం కోసం చర్యలు చేపట్టాలని.బీసీల సమస్యలను పరిష్కరించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని నియోజకవర్గ బీసీ కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో నెలకొన్న బీసీ సమస్యలను పరిష్కరించాలని నియోజవర్గం బిసి సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి నేతృత్వంలో బీసీల మహాధర్నా నిర్వహించారు.ఈ ధర్నాకు రాజకీయ పార్టీలకు అతీతంగా వివిధ గ్రామాల నుండి యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గంలో సుమారు నలభై పైగా బీసీల సమస్యలు ఉన్నాయని అందులో ప్రధానంగా ఐదు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బీసీ నాయకులకు బీసీ సమీకృత భవనం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించి ప్రత్యేకమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారని నేటి వరకు అది ఆచరణలోకి రాలేదన్నారు. ఈ ధర్నాతో అయినా స్పందించి వెంటనే బీసీ సమీకృత భవనం కోసం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తాండూరు నడిబొడ్డున బీసీ స్మశానవాటిక అభివృద్ధికి నోచుకోక కాలు పెట్ట లేని స్థితిలో ఉందని అనేకమార్లు మున్సిపల్ కమిషనర్ ల దగ్గర నుండి కలెక్టర్ వరకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు.గొల్ల చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్కను,తూముకు మరమ్మతులు చేపట్టాలని బీసీ గురుకుల పాఠశాల లకు మరియు వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలని కుల వృత్తుల వారికి ఆధునికమైన పనిముట్లు మరియు రాయితీలను కల్పించాలని డిమాండ్ చేశారు .సమస్యలన్నీ అధికారులు 30 రోజుల్లో పరిష్కరించకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వేలాది బిసి యువకులతో నాయకులతో ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు సయ్యద్ షుకూర్ జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్ మహిళా అధ్యక్షురాలు జ్యోతి రజక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ వడ్డెర సమాజ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు పరమేష్ హనుమంతు తట్టిపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ అంజి గొల్ల చెరువు మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు నరహరి గోపాల్ రాజు జీవన్గి ఉప సర్పంచ్ జగదీష్ తాండూర్ బషీరాబాద్ యాలాల, పెద్దేముల్ మండల యువజన అధ్యక్షులు బసంత్ కుమార్ నరేందర్ లక్ష్మణా చారి బాలు యాదవ్ తాండూర్ నియోజవర్గ పట్టణ అధ్యక్షుడు బోయ నరేష్ యువజన కార్యదర్శి బోయ రాధాకృష్ణ యూత్ కాంగ్రెస్ నాయకులు బంటు వేణు జగదీష్ రాజ్ కుమార్ బిజెపి యువ నాయకులు కురువ జగదీష్ తాండ్ర నరేష్ టిఆర్ఎస్ యువ నాయకులు రమేష్ టైలర్ మంతన్ గౌడ్ అశోక్ సమీ అమరేష్ రజక నరసింహ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఎస్పి రవికాంత్ శ్రీకాంత్ రాము ముదిరాజ్ జగదీష్ హరి ప్రసాద్ భాస్కర్ బీసీ పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ బీసీ యువజన సంఘం నాయకులు బస్సు మతిన్ జంతు పల్లి వెంకట్ శివ రఘు సయ్యద్ బీసీ మహిళా సంఘం సభ్యులు అనిత విజయలక్ష్మి మంజుల సుమన్ తదితరులు పాల్గొన్నారు.