బుకీల నుంచి డబ్బులు తీసుకున్నా : సిద్ధార్థ్‌ త్రివేది


న్యూఢిల్లీ ,జూన్‌ 20 (జనంసాక్షి) :

ఐపీఎల్‌ స్పాట్‌ఫిక్సింగ్‌ వివాదంలో రాజస్థాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ సిధ్ధార్థ్‌ త్రివేదీ మరో బాంబు పేల్చాడు. తాను బుకీల నుండి డబ్బులు తీసుకు న్నట్టు ఒప్పుకున్నాడు. ఇటీవల పోలీసుల విచార ణలో భాగంగా కోర్టుకు హాజరైన త్రివేదీ ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఆ స్టేట్‌మెంట్‌ ప్రకారం బుకీలు దీపక్‌ శర్మ, సునీల్‌ భాటియా నుండి మూడు లక్షలు తీసుకున్నానని, అయితే గత ఏడాది స్టింగ్‌ ఆపరేషన్‌లో ఐదుగురు క్రికెటర్లు దొరికిపోవడంతో వెంటనే తిరిగి ఇచ్చేశానని పేర్కొన్నాడు. గతంలోనే ఈ స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేసినప్పటకీ… పోలీసులు బయటకు వెల్లడించ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మేజిస్టేట్ర్‌ సమక్షంలో రికార్డు చేసిన స్టేట్‌ మెంట్‌లో త్రివేదీ ఈ వివరాలు వెల్లడించి నట్టు తెలుస్తోంది. 2010 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లేయర్‌ అమిత్‌సింగ్‌ తవకు బుకీలను పరి చయడం చేశాడని వివరించాడు. అలాగే 2011 ఐపీఎల్‌ సీజన్‌ సమయంలో సహచర క్రికెటర్‌ అజిత్‌ చండిలా, బుకీ దీపక్‌శర్మను కలిపించాడని చెప్పాడు. తర్వాత దీపక్‌ శర్మ, చండిలాతో కలిసి డీఎల్‌ఎఫ్‌ మాల్‌లో షాపింగ్‌ చేశానని, వారు ఖరీదైన దుస్తులు, పెర్ఫ్యూమ్స్‌ కొనిచ్చారని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. 2012లో అహ్మాదా బాద్‌ వేదికగా ఒక టోర్నమెంట్‌ ఆడేందుకు వెళ్లినప్పుడు మరో బుకీ సునీల్‌ భాటియాను చండిలా పరిచయడం చేశాడని వెల్లడించాడు. అయితే రాజస్థాన్‌ టీమ్‌లో చండిలాకు చోటు దక్కడానికి తానే కారణమని చెప్పాడు. ఐపీఎల్‌ ఐదో సీజన్‌ ప్రారంభానికి ముందు రాజస్థాన్‌ టీమ్‌ మరో బౌలర్‌ కోసం చూస్తుండగా..

చండిలా పేరు చెప్పానని, సెలక్షన్స్‌లో అతను ఎంపికయ్యాడని తెలిపాడు. ఈ ఏడాది కూడా ఐపీఎల్‌ ప్రారంభంలో అమిత్‌సింగ్‌, దీపక్‌శర్మలు తనను కలిసేందుకు ప్రయత్నించా రని, తాను నిరాకరించినట్టు చెప్పాడు. అయితే మరో బుకీ భాటియా ఒక ¬టల్‌కు రమ్మని కోరగా… అక్కడ అమిత్‌సింగ్‌, దీపక్‌ ఉన్నారని చెప్పాడు. ప్రస్తుతం స్పాట్‌ఫిక్సింగ్‌ కేసులో సిధ్ధార్థ్‌ త్రివేదీ కేసును కీలకంగా భావిస్తున్నారు. ప్రాసి క్యూషన్‌ తరపున అతని స్టేట్‌మెంట్‌ను సాక్ష్యంగా ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిధ్దమవు తున్నారు. ప్రత్యక్ష విచారణలో కూడా త్రివేదీ మరోసారి సాక్ష్యమిస్తే ఆరోపణలు ఎదుర్కొంటోన్న చండిలా, చవాన్‌తో పాటు శ్రీశాంత్‌లు పూర్తిగా చిక్కుకున్నట్టే.