*బుగులోని జాతర వేలం పాటల ఆదాయం ₹2లక్షల98 వేలు*

రేగొండ : బుగులోని జాతర వేలంపాటల ఆదాయం ₹2లక్షల98 వేల 6 వందలు వచ్చినట్లు  జాతర చైర్మన్ కడారి జనార్ధన్ తెలిపారు.  వచ్చేనెల 7 నుండి 11వ తేదీ వరకు కార్తీక మాసం పురస్కరించుకొని మండలంలోని తిరుమలగిరి శివారులో నీ గుట్టల్లో భూగులోని వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ జాతరలో షాపులు నిర్వహించుకొనుటకు మండలంలోని తిరుమలగిరి గ్రామపంచాయతీలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. ఈ వేలం పాటల్లో కొబ్బరికాయలు అమ్ముకొనుటకు ₹ఒక లక్ష 35వేలు, లడ్డు పులిహోర అమ్ముకొనుటకు ₹ఒక లక్ష 60వేలు, పేలాలు పుట్నాలు అమ్ముకొనుటకు ₹3600 కు పలువురు వ్యాపారులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర కార్యనిర్వాహ అధికారి శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కట్ల రాణి మధుసూదనారెడ్డి, ఎంపిటిసి గంట గోపాల్, జాతర ధర్మకర్తలు అమ్ముల సదయ్య, పుజరి రవి, బక్కథట్ల ఒదకర్, గడ్డం రజిత, రావుల శ్రీధర్, కొప్పుల రాము, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ సుదర్శన్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.