బుధవారం నాడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా కోట్ పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామంలో 07:00 AM నుండి 11:00 AM వరకు పర్యటించారు.

బీరోల్ రోడ్డు మంజూరు చేయించడం జరిగిందని, రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్ తో  ప్రజల సమక్షంలో మాట్లాడారు.*
 రైతులకు పంపించిన మినీ కిట్స్ విత్తనాలను పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
  మిషన్ భగీరథ మంచినీటి ట్యాంక్ ను శుభ్రం చేయాలని, ప్రతీ గ్రామంలో ప్రతీ నెల 1, 11, 21వ తేదీలలో నెలకు మూడు సార్లు త్రాగునీటీ వాటర్ ట్యాంక్ ను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
 గ్రామంలో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ…. ఇండ్ల మధ్యలో ఉన్న పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు తీసివేస్తూ…. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు.
  మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలని, ప్రజలు చెర్రలు తీయరాదని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు