బూస్టర్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌లో మందగమనం

సకాలంలో అందని డోసులతో అయోయం

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): ఓ వైపు ఫోర్త్‌వేవ్‌ హెచ్చరికలు…మరోవైపు పెరుగుతున్న కేసులు మరోమారు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాగే మంకీపాక్స్‌ ఒకటి మధ్యలో మళ్లీ కలకలం రేపుతోంది. వూహాన్‌లో కేసుల పెరుగుదల కూడా ఆందోళన కలిగించే అంశం. ఈ క్రమంలో తెలుగు రాష్టాల్ల్రో వాక్సినేషన్‌ సాగుతోంది. జూన్‌లో పెద్ద ఎత్తున వాక్సినేషన్‌ జరిగినా, ఒక్కసారిగా డీలా పడిరది. మొదటి డోస్‌ వేసుకున్నోళ్లకు రెండో డోస్‌ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్‌ డోస్‌ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. బూస్టర్‌ డోస్‌ ప్రకటించినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. అయితే వ్యాక్సినేషన్‌పై కొందరు ఇంకా వెనకబడి ఉన్నారు. కావాలనే కొందరు ముందుకు రావడంలేదని సమాచారం. ప్రభుత్వాలు కూడా ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నాయి. అలాగే కేసుల పెరుగుదల కూడా ఆందోళన కలిగించేదిగాఉంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్‌ కొనసాగుతోంది. అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ టీకా ఇస్తున్నారు.
అయితే సరిపడా డోసులు లేకపోవడంతో కొందరికి మాత్రమే అందుతున్నాయి. అయితే రెండో డోస్‌ వేయించుకోవాల్సిన వారి సంఖ్య ఇప్పుడు బాగా పెరిగింది. దాదాపు 50 లక్షల మంది సెకెండ్‌ డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ప్రభుత్వం వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఏ సెంటర్లో దొరుకుతుందనేది మాత్రం కష్టంగా మారింది. కేంద్రం నుంచి రావాల్సిన డోసులు మరింత పెరిగితే ఈ కష్టాలకు ఫుల్‌స్టాప్‌ పడుతుంది. కేంద్రం కూడా ఆయా రాష్టాల్రకు డోస్‌ల సంఖ్యను పెంచడం లేదు. దీంతో గ్రామస్థాయిలో వ్యాక్సిన్‌ సక్రమంగా సాగడం లేదు. ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై సవిూక్షించారు.

తాజావార్తలు