బెంగళూరు బేజార

˜   గేల్‌, కొహ్లి పోరాటం వృథా

˜ బౌలర్లపై విరుచుకుపడిన గిల్‌ క్రిస్ట్‌

˜ ఏడు వికెట్ల తేడాతో పంజాబ్‌ విజయం

గేల్‌ మెరిసినా! కోహ్లి ఆడిన ! ఓడిన బెంగుళూర్‌

బెంగళూరు :

బెంగళూరులో మంగళవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌పై బెంగళూరు జట్టుపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు ఐదు వికెట్ల నషా ్టనికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా 20 బంతు ల్లో 19 పరుగులు చేశాడు. ఆవానా బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి మిల్లర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. క్రిస్‌ గేల్‌ వచ్చీరావడంతోనే రెచ్చిపోయి ఆడాడు. 53 బంతుల్లో 77 (4 ఫోర్లు, 6 సిక్స్‌లు) పరుగులు చేసి ఆవా నా బౌలింగ్‌లో ఔటయ్యాడు. విరాట్‌ కొహ్లీ కూడా దూకుడుగా ఆడి 43 బంతుల్లో 57 (6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశాడు. అజార్‌ మహ్మద్‌ బౌలిం గ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. డివిల్లర్స్‌ 6, రాహుల్‌ 8 పరుగులు చేయగా హెన్రి (0) నాటౌట్‌గా మిగిలాడు. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ గిల్‌ క్రిస్ట్‌ బెంగళూరు బౌలర్లపై విరుచు కుపడ్డాడు. 54 బంతుల్లో 85 (10 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. మార్ష్‌ 8, అజార్‌ మహ్మద్‌ 61, మిల్లర్‌ 2, సతీష్‌ 12 (నాటౌట్‌) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో ఆవానా మూడు, మహమూద్‌ రెండు వికెట్లు తీశారు. బెంగళూరు జట్టులో ఖాన్‌, ఉనాడ్కట్‌, మురళీధరన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.