బెంగాల్‌లో మరోమారు హింస

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికార టిఎంసి దౌర్జన్యం
కోల్‌కతా,మే17(జ‌నం సాక్షి ): పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌లో మారోమారు హింస చోటుచేసుకుంది. ఇప్పటికే ఎన్నికల సందరన్బంగా పలువురు మృతి చెందారు. గురువారం కౌంటింగ్‌ చేపట్టగా  ప్రతిపక్ష నేతలు, కౌంటింగ్‌ ఏజెంట్లపై అక్కడ దాడులు జరిగాయని సమాచారం. కౌంటింగ్‌ సెంటర్ల నుంచి నేతలను, ఏజెంట్లను వెళ్లగొడుతున్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్కర్లు.. నార్త్‌ దినాజ్‌పూర్‌లో ఇద్దరిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీ విధ్వంసం, హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో సుమారు 20 మంది మృతిచెందారు. అయితే ఇవాళ ఓ కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద భారీ ఆందోళన జరిగింది. దాంతో బిర్‌బమ్‌ సెంటర్‌ వద్ద పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టీఎంసీ, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ప్రస్తుతం దీదీ పార్టీ గ్రామపంచాయతీ ఎన్నికల్లో లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.